నమస్తే శేరిలింగంపల్లి: తల్లిదండ్రుల మధ్య గొడవ అనంతరం బయటికి వెళ్ళిన తండ్రి అదృశ్యమైన సంఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమ్ నాథ్ చారి (36) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చండానగర్ లోని శివాజీ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయితే 20వ తేదీన తన తల్లి దండ్రులు ఇద్దరు గొడవ పడ్డారు.
అనంతరం తన తండ్రి హనుమయ్య 61 ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని జనరల్ స్టోర్‌కు వెళ్లగా అక్కడ లేకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన వ్యక్తి తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడు. అతని ఎత్తు 5.3 అడుగులు, హిందీ & తెలుగు భాషలలో కూడా మాట్లాడగలడని ఫిర్యాదులో పేర్కొన్నారు.