నమస్తే శేరిలింగంపల్లి : రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు సుబ్రమణ్యం వ్యాఖ్యానం, కోలాటలాతో త్రిమూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
మియాపూర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా, బంధుమిత్ర సపరివారముతో కలిసి వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఆ దేవి దేవతల ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమం ఆలయ వ్యవస్తపకురాలు భారతీయం సత్యవాణి పర్యవేక్షణలో జరిగింది.