హెచ్.సి.యు యూనివర్సిటీ లీజును  పొడిగించాలి

  • హెచ్.సి.యు యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు, వారి తల్లదండ్రుల నిరసన
  • మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
హెచ్.సి.యు యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు, వారి తల్లదండ్రుల నిరసనకు మద్దతుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు వారి తల్లిదండ్రులు. .హెచ్. సి.యు యూనివర్సిటీ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి అనూహ్య స్థాయిలో మద్దతు లభిస్తున్నది. ఇందులో భాగంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, మాదాపూర్ కంటేస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, కంటేస్టడ్ కార్పొరేటర్ ఏల్లేష్ , బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయ స్కూల్ ను హెచ్.సి.యు ప్రాంగణంలో లీజుకు తీసుకుని 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు కొనసాగిస్తున్నారని, 2024 లో వారి లీజు ముగియవస్తుందని కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్క తరగతి చొప్పున తగ్గించుకుంటూ వస్తున్నారని, 7,8,9 తరగతులు పిల్లలు ఇంకా చదువుకుంటుండగా కేంద్రీయ విద్యాలయ వారు మేము కొనసాగించలేమని శాలరీ లు ఇవ్వలేకపొతున్నామని  తెలియజేయగా .. విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందేమోనని  తల్లిదండ్రులు ఆందోళన గురవుతూ మా దృష్టికి  తీసుకువచ్చారని తెలిపారు. తక్షణమే స్పందించి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులలో కలిసి వెళ్ళి సమస్యను వారికి తెలిపి వినతి పత్రం అందజేయగా.. వారు స్పందిస్తూ హెచ్.సి.యు వారితో సంభాషించి లీజు ను పొడిగించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వారికి మా మద్దతు తెలుపుతూ లీజు పొడిగించే వరకు పోరాటం చేద్దామని , ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి  కూడా తీసుకెళ్ళి విద్యార్ధులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, చంద్రయ్య యాదవ్, ఆంజనేయులు, నరసింహ,  పద్మ, వరలక్ష్మి , రేణుక, అరుణ, నాగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

హెచ్.సి.యు యూనివర్సిటీ ఎదుట నిరసత తెలుపుతున్న విద్యార్థులు, వారి తల్లదండ్రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here