- మియాపూర్, బొల్లారం చౌరస్తా లలో నిరసన
నమస్తే శేరిలింగంపల్లి: గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ఆదేశాలమేరకు మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్, బొల్లారం చౌరస్తా లలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళ సోదరీమణులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మోడీ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ భారత దేశ జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్, కిరణ్, చంద్రిక, రోజా, మహేందర్, ఖాజా, రఘు నాథ్ రావు, వజీర్, జంగిర్, శ్రీధర్, రాణి, స్వరూప, దయానంద్, రాజేష్, హన్మంతరావు, స్వామి నాయక్, తిరుపతి, సంతోష్, శివ, వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మణ్, లక్ష్మయ్య, గోపాల్ రావు, తిమ్మరాజు, సుధాకర్, కమలాకర్,రవీ, నరేష్ , మల్లేష్ కార్యకర్తలు, మహిళనాయకులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీ ప్రతినిధులు, మహిళలు, బీఆర్ ఎస్ పార్టీ శ్రేయభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.