‘ఇంటింటికి తెలుగుదేశం’ కు అనూహ్య స్పందన

  • తారా నగర్ లోని తుల్జా భవాని అమ్మవారి గుడిలో ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి:  తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం  కోఆర్డినేటర్ కట్ట వెంకటేష్ గౌడ్ సూచనలతో  శేరిలింగంపల్లి  డివిజన్ కోఆర్డినేటర్  ఏరువ సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తారా నగర్ లోని తుల్జా భవాని అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అనంతరం ఇంటింటికి వెళ్లి నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని తెలియజేశారు.

తారా నగర్ లోని తుల్జా భవాని అమ్మవారి గుడిలో శేరిలింగంపల్లి  డివిజన్ కోఆర్డినేటర్  ఏరువ సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో  ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన దృశ్యం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. నేడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ సమస్యలు అక్కడే  తిష్ట వేసుకుని ఉన్నాయని తెలిపారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రతి గల్లీలో డ్రైనేజీ సమస్యతోపాటు రోడ్లు, విద్యుత్, నీటి సమస్యలు పాగా వేశాయని పేర్కొన్నారు. కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రజల వాపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సుభాష్ యాదవ్, పార్లమెంట్ నాయకులు వెంకట రెడ్డి, రాష్ట్ర నాయకులు కుర్ర ధనలక్ష్మి, సుభాషిని, డివిజన్ కోఆర్డినేటర్లు ఆరేపల్లి సాంబశివ గౌడ్, T. వెంకట్రావు, సయ్యద్ సిరాజు,  కుర్ర మహేష్, చిట్టి బాబు, కొడాలి రవి, ఇలేష్ యాదవ్, బాలాజీ, శ్రీహరి యాదవ్, వెంకటయ్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శివరాజ్ వర్మ, శివ కుమార్, శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు  శ్రీనివాస రావు, గౌతమ్, రామారావు, శ్రావణ్ కుమార్, నవీన్ కుమార్, సుబ్బారావు, లక్ష్మణ్, బాబా, దయనాధ్ గౌడ్, శేఖర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శేరిలింగంపల్లి  డివిజన్ కోఆర్డినేటర్  ఏరువ సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ర్యాలీగా వెళ్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here