- బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: పార్టీ కార్యకర్తలకు, నాయకులు తాను అండగా ఉన్నానని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడద్దు, ఆందోళన చెందద్దని బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయన వెంట పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచార మాద్యమాల్లో తెలిసిందన్నారు.
వారికి వీడ్కోలు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న పార్టీ కార్యకర్తలకు, ఉద్యమకారులకు పాదాభివందనాలు తెలిపారు. పార్టీని మళ్లీ పూర్వ వైభవం తీసుకొద్దామని, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పోరాటం చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉందామని, ప్రతి కాలనీలో పాదయాత్రలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశిస్తే వ శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.