- పనులు పరిశీలించిన రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్ చొరవతో యాదవుల కోసం కొకపేటలో నిర్మిస్తున్న శ్రీ కృష్ణ యాదవ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గ మల్లేశం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి. రవీందర్ యాదవ్, షేప్స్ అండ్ గోట్స్ ఫెడరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చింతల రవీందర్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్, ట్రస్ట్ సభ్యుడు రాగం నాగేందర్ యాదవ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు బైకన్ శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్, రాష్ట్ర ట్రెజరర్ దారబోయిన శ్రీనివాస్ యాదవ్, యూత్ అధ్యక్షుడు ఏ రమేష్ యాదవ్, లీగల్ సెల్ ప్రెసిడెంట్ చలకాని వెంకట్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్, వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.