ఆరంభ టౌన్షిప్ లో ముగ్గుల పోటీలు

ఆరంభ టౌన్షిప్ లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్షిప్ లో ఆరంభ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఘనంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ , GHMC స్టాండింగ్ కౌన్సిల్ నెంబర్ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తోపాటు ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్ పాల్గొని విజేతలైన మహిళలకు బహుమతులు అందించారు.

ఆరంభ టౌన్షిప్ లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఇదేవిధంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. వారి వేసిన ముగ్గులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆరంభ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అరుణ శ్రీ, దాసరి సరిత, మౌలిక, విజయా చౌహన్, కరిష్మా ఖాన్, అసోసియేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి, రెహానా బేగం, రాజేష్, జనార్ధన్, హరా కిషన్, నాగరాజు, విక్రమ్ యాదవ్, కుటుంబరావు, మన్నే రవీందర్, నరేంద్ర కుమార్, బిక్షపతి, మహేష్, శ్వేత, కోమల, రజిని, మానసా రెడ్డి, శ్రీనివాస్, మదర్ సాబ్, మైపాల్ యాదవ్, నయీమ్ ఉద్దీన్, సాయిరాం పాల్గొన్నారు.

విజేతలుగా నిలిచినా మహిళలకు బహుమతులు అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ , GHMC స్టాండింగ్ కౌన్సిల్ నెంబర్ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here