నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ముందు ముందు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా బంజారా సమితి అధ్యక్షులు హనుమంతు నాయక్, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, ఉపాధ్యక్షులు ఎండి కమర్ పాషా, గోపాల్ యాదవ్, గణేష్ నాయక్, రిపోర్టర్ షఫీక్ , రిపోర్టర్ విజయ్, బాలరాజ్ సాగర్ , నాగరాజు , భరత్ లవణాచారి , నేతాజీ నగర్ యూత్ ప్రధాన కార్యదర్శి భవన్ డీజే ,సాయి తేజ, సాయి సాగర్, శ్రీనివాస్ , అశోక్ , రాజు, బాలీష్ ,దినేష్, కుమార్, ప్రశాంత్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్దలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
