- శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా నివాళి అర్పించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయలు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష జాతి వైభవాన్ని ప్రపంచం నలుమూలల తెలిపిన విజయనగర సామ్రాజ్య వీరుడు, అఖండ భారత మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు.
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు యాదవ కుల వంశస్తుడని యాదవుల చరిత్ర ఈనాటిది కాదని, తరతరాల యాదవుల చరిత్ర తెలుసుకొని యాదవులంతా సంఘటితం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కే నరసింహ యాదవ్, ఏ ప్రభాకర్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, మిద్దెల దీక్షిత్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.