- శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ లను కలిసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ లను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విషయమై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ తో చర్చించామని, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూఢాలన్నారు.
గతంలో అభివృద్ధి పనులకు నెలకు డివిజన్ల వారిగా 8 కోట్లు విడుదల అయ్యేవని, ఇప్పుడు 4 కోట్లు మాత్రమే మంజూరు అవుతున్నాయని, అవి కూడా సకాలంలో రాలేకపోతున్నాయని తెలిపారు. సకాలంలో మంజూరు అయ్యేలా చూసి, అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఐఏఎస్ దృష్టికి తీసుకువెల్లిన్నట్లు తెలిపారు.