నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి గచ్చిబౌలి ఇందిరా నగర్ కాలనీలోని సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డీఎల్ఎఫ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నుండి మురుగు నీరు కాలనీలోకి ప్రవహించి రోడ్లు అన్ని మురుగు మయమవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ .. కాలనీలో నెలకొన్న మురుగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, త్వరలోనే కాలనీలో పర్యటిస్తామని, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సయ్యద్ నయీమ్, ఆఫజల్, షఫీ, ఇక్బాల్, శేఖర్, రాజేంద్ర, జోషి, కాలనీ వాసులు పాల్గొన్నారు.