- రైతుల ఖాతాలో రూ. 5వేల చొప్పున జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- మిన్నంటిన సంబురాలు
- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
- మియాపూర్ లో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం
నమస్తే శేరిలింగంపల్లి : మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మియాపూర్ డివిజన్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వారు ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10లక్షలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మియపూర్ డివిజన్ పరిధిలోని బస్ స్టాప్ నందు శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మహిళ నాయకులతో కలిసి మిఠాయిలు పంచి మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వారు వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి పంట సాగు కోసం పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 5వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని మియపూర్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి, ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, సాంబశివరావు, నడిమిట్టి కృష్ణ, నల్ల సంజీవ రెడ్డి, సయ్యద్ తహెర్, నరేందర్ గౌడ్, సయ్యద్ సాదిక్ హుస్సిన్, శ్రీనివాస్, మునఫ్ ఖాన్, సుదర్శన్, రామచందర్ గౌడ్, ఆశీల శివ కుమార్, సంగారెడ్డి, రమేష్, భాస్కర్ గౌడ్, శ్రీను ముదిరాజ్, హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు రాజీ రెడ్డి, శ్రీకాంత్, రాము, నవీన్, విరేశం గౌడ్, మెయిన్, వెంకటేష్, పద్మ రావు, బాబు గౌడ్, కృష్ణ గౌడ్, యూత్ సభ్యులు అసిఫ్, దేవదుర్గ గిరి, నరేందర్ ముదిరాజ్, టౌసిఫ్, శేఖర్, అలీ, బిక్షు, నవీన్, కుమార్, విష్ణు, ప్రవీణ్, శ్రవణ్, మహిళలు సత్యమ్మ, కవిత, శశికళ, శిరీష, సుష్మిత, జ్యోతి, రమ్య, విజయలక్ష్మి, సావిత్రి, సుశీల, వెంకతమ్మ, పద్మ, లలిత, సంగీత, లక్ష్మీ, శ్రీదేవి సభ్యులు పాల్గొన్నారు.