నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని గౌతమినగర్ వేముకుంటలోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయములో కార్తీకమాసం అమావాస్య చివరిరోజు సందర్భంగా మంగళవారం పుట్టమట్టితో 365 శివలింగాలను తయారు చేశారు.
అనంతరం అభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని శివునికి అభిషేకం చేసి తమ భక్తిని చాటుకున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాగంణం కిటకిటలాడింది.