- రేపటి నుంచి ఆరు గ్యారెంటీల కోసం అప్లికేషన్లు
- జనవరి 6వరకూ తీసుకుంటారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చార్జి జగదీశ్వర్ గౌడ్ వెల్లడి
- ఆరు పథకాల అమలును స్వాగతిస్తూ సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే 6పథకాల అమలుకు శ్రీకారం చుటిందని, పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా నిలుస్తుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిసెంబర్ 28 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రేపటినుండి జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తికి సహకరించాలని తమతమ బస్తి, కాలనీ, ఏరియాలోని ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి అప్లికేషన్స్ కోసం అన్ని విధాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి జైపాల్, రఘునందన్ రెడ్డి, గఫుర్, సాంబశివరావు, నాగేశ్వరరావు, ఏకాంత్ గౌడ్, శ్రీకాంత్, సయ్యద్ తహెర్ హుస్సేన్, అక్బర్, వేరేశం గౌడ్, శేఖర్ ముదిరాజ్, కోటేశ్, ఏకే బాలరాజు, డివిజన్ అధ్యక్షులు మహిపల్ యాదవ్, సురేష్ నాయక్, భారత్ గౌడ్, షేక్ అలీ, ఇలియస్ షరీఫ్, మరేళ్ల శ్రీనివాస్, బాష్పక యాదగిరి, జంజీర్, హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, కల్పన ఏకాంత్ గౌడ్, శిరీష, లక్ష్మీ, శశిరేఖ, సీతమ్మ, తన్విర్, వహీదా, పార్వతి, ప్రమీల, మంజుల, ప్రవీనా, నాయకులు, యువకులు పాల్గొన్నారు.