సీఆర్ ఫౌండేషన్ లో ముత్యాల ముగ్గుల పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలోని సీఆర్ ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి, మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

మాదాపూర్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలను పరిశీలిస్తున్న కొమిరిశేట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ న్యాయనిర్ణేతలు

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలగా కల్పన, సరోజ, సరస్వతి వ్యవహరించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, విష్ణు ప్రసాద్, జనార్ధన్, స్థానిక మహిళా నాయకురాలు వాణి సాంబశివరావు, రొటేరియన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here