నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని నల్లగండ్ల గ్రామంలోని సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామం సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులుగా నియమించబడిన పురం విజేందర్ రెడ్డి, శోభా, మరమల్ల భాగ్య రావు, శివ కుమార్, లక్ష్మీ నారాయణ, శివ కుమార్ గౌడ్, రాగం సాయి కుమార్ కి నూతన కమిటీ నియామకపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.