- నివాళి అర్పించిన మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదాన్ దివాస్ సందర్భంగా కొండాపూర్ లోని మసీదు బండ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ శాసన సభ్యులు భిక్షపతి యాదవ్. అనంతరం మాట్లాడుతూ అఖండ భారతావనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా చెప్పిన గొప్ప మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు. జాతీయ సమగ్రత, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను తీవ్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రత్యేక సంస్థానంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వెళ్లాలంటే నాడు ఫర్మిషన్, 370 ఆర్టికల్ విధానాన్ని వ్యతిరేకించి రద్దు అయ్యేందుకు పోరాడి అక్కడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదానమైయ్యారని గుర్తు చేశారు. దేశం మొత్తం ఒక్కటే భారత రాజ్యాంగం అమలు చేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కాంటెస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ , లింగంపల్లి కాంటెస్టడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేశ్ , కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు సాగర్, రమేష్ , వినోద్ రావు , సదానంద యాదవ్ , శ్రీశైలం యాదవ్ , శివ, గోవర్ధన్ నాయక్ పాల్గొన్నారు.