- పార్టీలో చేరిన బిజెపి సీనియర్ నాయకుడు పోచయ్య.. సాదరంగా ఆహ్వానించిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల చూపంతా బీఆర్ఎస్ వైపే ఉందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎనక్లేవ్ కాలనీకి చెందిన బీజేపీ కి చెందిన సీనియర్ నాయకులు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ లో చేరగా.. చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ఆయనకు బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పోచయ్య బీజేపీ పార్టీ నుండి తిరిగి సొంత గూటికి రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, ఆనంద్ పాల్గొన్నారు.