మియాపూర్ లో చెల్లెలిపై అన్న హత్యాయత్నం…

  • నిందితుడికి ఒక సంవత్సరం జైలు, వెయ్యి జరిమానా

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తాండలో చెల్లెలిపై ఓ అన్న హత్యాయత్నం చేసిన సంఘటన గత సంవత్సరం మార్చ్ నెలలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం … భర్తతో మనస్పర్ధలు కారణంగా ఓ మహిళ తన పుట్టింటికి వచ్చి ఉంటున్నది. ఇది ఇష్టం లేని తన తమ్ముడు తన అక్కని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి చాలా సార్లు ఆమెని బెదిరించాడు, ఇంట్లోంచి వెళ్లకపోవడంతో చంపేందుకు వెనకాడలేదు. ఆమెను ఇంట్లోంచి బయటికి తోసేసి బండరాయితో దాడిచేసాడు. ఆ రాయి ఆమె కుడి కాలిపై పడడంతో తీవ్ర రక్తస్రావమంది. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో కొండాపూర్ హాస్పిటల్ లో చేర్పించారు, తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పాతలోత్ రవీందర్ ను జైలుకు పంపారు. ముద్దాయిపై చార్జ్ సీటు దాఖలు చేశారు, కూకట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జ్ బి. శ్రీనివాస్ రావు సాక్షులను విచారించి నిందితునికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరుపున పిపి ఉపేందర్, ఈ కేసును పర్యవేక్షించిన మియాపూర్ CI తిరుపతి రావును, నిందితుడి కేసు పరిశోధన చేసిన గిరీష్ కుమార్, కోర్ట్ కానిస్టేబుల్ రాజశేఖర్ లను ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here