నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహించిన శాంకరి కూచిపూడి డాన్స్ మ్యూజిక్ అకాడమీ పద లాస్యం ” రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా
వినాయక స్తుతి, భైరవి వర్ణం, జావళి, ప్రహళ్లాద శబ్దం, త్రిశక్తి స్తుతి, నవరాగమాలిక వర్ణం, తారంగం, తిల్లాన , మహిషాసుర మర్ధిని స్తోత్రం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిధులుగా నాట్య గురువులు ప్రొఫెసర్ భాగవతుల సేతురాం, డాక్టర్ సాగి కమలాకర శర్మ, లలిత సుధాకర్ , డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి కళాకారులను అభినందించి ఆశీర్వదించారు.