నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాధమిక ఆంగ్ల మధ్యమ పాఠశాలలోని విద్యార్థులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ యూనిఫార్మ్స్ ను అందచేశారు. పేద ప్రజల పిల్లలు చదువుకునేందుకు సురభికాలనీలో ఆరేండ్ల కిందట ఈ పాఠశాలను తన సొంత ఖర్చుతో నిర్మించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బోధిస్తున్న విద్యను చక్కగా అర్ధం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, సమాజంలో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువు కోసం తన వంతు కృషి ఎల్లపుడు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మన్ బస్వరాజ్ లింగయ్యత్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు ఆశ్రఫ్, గోపాల్ యాదవ్, పాఠశాల సిబ్బంది, మిడ్ డే మీల్స్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.