- చండీయాగ మహోత్సవంలో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింంగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎనక్లేవ్ కాలనీలోని విశాఖ శ్రీ శారదాపీఠ పరిపాలిత శ్రీ లక్ష్మిగణపతి దేవాలయంలో శ్రీ సహస్ర రుద్ర సహిత సహస్ర చండీయాగ మహోత్సవం వేడుకగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ:సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని శ్రీ చండి అమ్మవారిని వేడుకున్నానని, అమ్మవారి దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, దేవస్థానం వ్యవస్థాపకులు, చైర్మన్ రమణామూర్తి, కమిటీ సభ్యులు చెన్నారెడ్డి, సుధాకర్ రావు, చంద్రశేఖర్, గోవర్ధన్ రెడ్డి, వరలక్ష్మి, ఉమామహేశ్వరి, అరుణ, సంధ్య, శైలజ, వనజ, పద్మావతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.