రేగుల కుంట చెరువును స్వచ్ఛమైన చెరువుగా తీర్చిదిద్దుతాం

  • రేగుల కుంట చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : రేగుల కుంట చెరువుకు దశ దిశ మారినదని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలోని రేగుల కుంట చెరువు సుందరీకరణలో భాగంగా సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్వచ్ఛందంగా రూ. 1 కోటి 50 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సుందరీకరణ పనులను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినదని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచినీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని పేర్కొన్నారు.

చెరువు సుందరీకరణలో భాగంగా సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ సభ్యులతో కలిసి పరిశీలించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

సేల్స్ ఫోర్ష్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుందరీకరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయమని, సమాజ హితం, సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, సాఫ్ట్ వేర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగం పెంచాలని, అదేవిధంగా చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ చేపడుతున్నామని, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (యూజీడీ) నిర్మాణం, అలుగు మరమ్మతులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.

చెరువు సుందరీకరణ పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో సేల్ష్ ఫోర్ష్ కంపెనీ ప్రతినిధులు చైతన్య తాళ్లూరి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, పూర్ణచందర్, సీతారామయ్య, చంద్రశేఖర్ ,బాబు మోహన్ మల్లేష్, ప్రశాంత్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here