భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామి పడి పూజ

  • ప్రత్యేక పూజలు చేసిన కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ యువ జన నాయకుడు ఆదిల్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి నగర్ సీ బ్లాకు లోని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. వేదమూర్తులు భార్గవ గురు స్వామి ఆశీస్సులతో.. విజయ కృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో మహ శాస్త్ర హరి హర పుత్ర అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్ పాల్గొని పూజలు చేశారు. ప్రతి ఒక్కరికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, ఆ దేవుని కరుణ కటాక్షాలు పొందాలని, ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నానని తెలిపారు.

రాజా రాజేశ్వరి నగర్ సీ బ్లాకు లోని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ  కొండాపూర్ యువజన నాయకుడు ఆదిల్ పటేల్

ఈ కార్యక్రమంలో విజయకృష్ణ, మధు ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, చిట్టీ రాజు బాబు, రవి సాగర్, సూర్యనారాయణ, సత్యాందర్ సింగ్, అజయ్ సింగ్, విజయ్ సింగ్, శ్రీనివాస్ రావు, ప్రకాష్ రావు, శ్రీకర్, చౌదరి, పవన్, ప్రసాద్ రావు, నరేష్ కుమార్, శివ లింగం, కోటేశ్వరరావు, రాజశేఖర్ యాదవ్, నరేష్, శ్రీనివాసులు, వెంకటేష్, మల్లేష్ యాదవ్, అమిత్ కుమార్ ప్రజాపతి, మంగళగిరి, వెంకట సుబ్బయ్య, అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహ శాస్త్ర హరి హర పుత్ర అయ్యప్ప స్వామి పడి పూజలో పూజలు చేస్తున్న స్వాములు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here