నమస్తే శేరిలింగంపల్లి : సమాజానికి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ప్రజా ఆలోచన వేదిక కొనసాగుతున్నదని ఆ వేదిక అధ్యక్షుడు ఉప్పల గోపాలరావు తెలిపారు. వయోభారం వల్ల ప్రజాలోచన వేదిక కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నందున విద్య వెంకట్ (సీనియర్ జర్నలిస్టు)ను ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రజా ఆలోచన వేదిక కార్యక్రమాలు ఆయనే నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం వేదిక గురించి, అది చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ప్రజల్లో సామాజిక సామాజిక స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తూ, సమాజంలో నెలకొన్న అసమానతలు రూపుమాపడానికి 1976 లో ప్రజా ఆలోచన వేదిక స్థాపించబడిందని, ఆ దిశగా అడుగులు వేస్తూ వస్తున్నదన్నారు. రాజ్యాంగానికి లోబడి చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తూ నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడినట్లు పేర్కొన్నారు. నీతి నిజాయితీ ధర్మంను కాపాడేందుకు నిరంతరం సేవలందిస్తుందన్న వేదిక… బాధ్యత గల వ్యక్తులను గౌరవిస్తూ మున్సిపల్ కార్మికుల నుండి సమాజానికి సేవలందిస్తూ ప్రజా సమస్యల పట్ల ఆదర్శ సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులను సన్మానించినట్లు తెలిపారు. ప్రజలకు సేవలు అందించే రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తూ పౌరుల్లో బాధ్యత పెంచేందుకు కృషి చేస్తూ అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు కూడా వేదిక కృషి చేస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు