- జెండా ఆవిష్కరించిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాధవరెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాధవరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. గత వారం రోజులుగా ఉచిత మెడికల్ క్యాంప్, రక్త దాన, ఉచిత కంటి వైద్య శిబిరం, అన్నదానం, మొక్కల పంపిణీ కార్యక్రమం వివిధ సేవా కార్యక్రమాలు నియోజక వర్గ డివిజన్ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంశాల పట్ల అంకితభావంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాబోయే తరాల భవిష్యత్తు కోసం, భారతావని అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పని చేసే ఏకైక పార్టీ జనసేన తెలిపారు.