- చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండాను నిలబెట్టాలని పిలుపు
- మియపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశంలో వికారాబాద్ జిల్లా పరిషద్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంజినీరింగ్ ఎనక్లేవ్ వద్ద హాఫీజ్ పెట్, చందానగర్ మియపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా పరిషద్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికలకు సంభందించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రోత్బలంతో ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే టికెట్ వచ్చినప్పటికీ, ప్రజల మద్దతుతో లక్షకు పైగా ఓట్లు రావడం శేరిలింగంపల్లిలో మాత్రమే సాధ్యమైందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎం.పి అభ్యర్థి గెలుపునకు ప్రతిఒక్కరు కష్టపడి పని చేసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండాను నిలబెట్టాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడు అండగా ఉంటానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన నేపధ్యంలో శేరిలింగంపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, ఇలియస్ షరీఫ్, టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదురాజ్, జాయింట్ సెక్రటరీ ఎం.తిరుపతి, ఉపాధ్యక్షులు పి.దినేష్ రాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, డివిజన్ అధ్యక్షులు రేణుక, నాయకులు కనకమామిడి నరందేర్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, రవి కుమార, రాజేందర్, మోసిన, సుధాకర్, కిషోర్, మనెపల్లి సాంబశివరావు, సంగారెడ్డి, శ్రీహరి, దాస్, రాజు, రామకృష్ణ, ప్రసాద్, ఉమామహేశ్వరరావు, కార్తిక్ మహిళలు సంగీత, సునీత, విజయ, అనిత, ప్రియదర్శిని, మాధవి పాల్గొన్నారు.