అభివృద్దే ప్రధాన ధ్యేయం:  కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, స్థానిక నాయకుల పిలుపు మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు.

లింగంపల్లి విలేజ్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అనంతరం లింగంపల్లి విలేజ్ ప్రజల సౌకర్యార్దం లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ రవి యాదవ్ గారి సొంత నిధులతో ఏర్పాటుచేసిన బోరింగ్ ను కార్పొరేటర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లింగంపల్లి విలేజ్ లో 90 శాతం సీసీ రోడ్లు పూర్తయ్యాయని మిగిలిన కొన్నిచోట్ల నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసిన ప్రతి రోడ్డును నాణ్యతాయుతంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.

బోరింగ్ ను ప్రారంభిస్తూ…

అనంతరం బస్తీ దవాఖానలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా డాక్టర్లను రోగులకు సరైన విధానంలో కావలసిన మందులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానకు వచ్చిన పేషెంట్లను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకుని, బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, సీనియర్ నాయకులు రాంచందర్, అశోక్, అజీమ్, సుభాష్, విష్ణు వర్ధన్ రెడ్డి, కే రవి, బుయ్య మల్లేష్ గౌడ్, యాదగిరి, రాజారెడ్డి, రాకేష్ దేవులపల్లి, సాయి, హరీష్, విజయ్, సురేష్, రాజు, రేవంత్, మనోజ్, ప్రశాంత్, రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here