నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నందు, గోపాల్ గౌడ్, ఫాజిల్, గణేష్, రవి యాదవ్, వినయ్ రెడ్డి, గల్ రెడ్డి, వెంకటస్వామి, అప్పల్ కుమార్ యాదవ్, యోగి రెడ్డి, యాదయ్య గౌడ్, రవి కుమార్, నర్సిములు, దాస్, ఆకాష్, లక్ష్మీ బాయి, సైదమ్మ, ఏడుకొండలు, రిషి, మల్లేష్ పాల్గొన్నారు.