నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మయూరి నగర్ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్టాండింగ్ కమిటీలో ప్రస్తావించి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను గుర్తించి విశేష అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ వాసులు చంద్రిక, జహంగీర్, కృష్ణ, ప్రవీణ్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, హరిబాబు, సుధీర్, క్రాంతి, అంజన్, సంతోష్, గోపాల్ రెడ్డి, హరిబాబు, వరప్రసాద్, సాహిత్య, రాధాకృష్ణ, శేషు, రాజు, వర్మ, సోమరాజు, రాధాకృష్ణ, ఆంజనేయులు చౌదరి, సురేంద్ర, పవన్ పాల్గొన్నారు.