- కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
- సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్జీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50మంది నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి అనంతరం మాట్లాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపారు. హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి 2009 నుంచి తమపై నమ్మకంతో తన వెంట నడుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనెపల్లి సాంబశివరావు, శ్రీనివాస్ గౌడ్, రాంబాబు, నాగేశ్వరరావు, వీరభద్రరావు, విష్ణు, ఆనంద్ రావు, కేన్నడీ, రామసుబ్బారెడ్డి, ప్రకాష్, విష్ణు, వెంకట్రామిరెడ్డి, ఉపేందర్, నారాయణ, చంద్రమోహన్, కోటేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాస్ రావు, గాంధీ, నరేష్, శివ, కళ్యాణ్, సుమన్, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల రెడ్డి, శశిధర్ రెడ్డి, రంగారావు, ప్రభాకర్, దశరధ్ రామ్, బాషా, అలీ, సాదిక్, రమేష్ బాబు, కృష్ణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, నరేందర్ కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.