సత్య సాయి సేవా సమితి సేవలు అభినందనీయం

  • ఉచిత వైద్య శిభిరం లో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ లో బస్తీ దవాఖాన ప్రాంగణంలో ప్రశాంత్ నగర్ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని, పుట్టపర్తి సత్య సాయి సెంట్రల్ నుంచి ప్రత్యేక వాహనం వచ్చి ఉచిత వైద్య సేవలు అందించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సుమారుగా 400 పైగా వ్యక్తులకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. రక్త పరీక్షలు, జనరల్, దంత వైద్యం, బీపీ, షుగర్, గైనకలజీ, ఆర్థో, ECG, ENT, వంటి మొదలగు సేవలను ఉచితంగా అందజేసి మందులు ఇవ్వడంతో పాటు 800 మందికి పైగా అన్నదానం చేయడం పట్ల సత్యసాయి సేవా సమితి సేవలను ప్రశంసించారు. ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంతో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి వైద్య బృందం, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ రావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు , చంద్రిక ప్రసాద్ గౌడ్, అశోక్, అబ్రహాం, తిరుపతి నాయక్, స్వామి నాయక్, లకపతి నాయక్, సుధాకర్, మురళి, అబ్రహం, జీత్తు నాయక్, గోపి నాయక్, బాలాజీ నాయక్, జైపాల్ నాయక్, రాజు నాయక్, రమేష్ యాదవ్, ఈశ్వర్, పాల్గొన్నారు.

నడిగడ్డ తాండ లో ప్రశాంత్ నగర్ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here