శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ లోని జలమండలి కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, మంచి నీటి సరఫరా, UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ వాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర పనుల పై తక్షణమే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదు పై స్పందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని , ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM నారాయణ , DGM వెంకటేశ్వర్లు , DGM శరత్ రెడ్డి, DGM నరేందర్ రెడ్డి, మేనేజర్లు సుబ్రమణ్యం , యాదయ్య, సందీప్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సునీత, రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.