శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): పేద విద్యార్థులకు సందయ్య చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయం అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం ఖాజా గూడా ప్రభుత్వ పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవి కుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పేద ప్రజలకు చేస్తున్న సేవలు అద్భుతమని అన్నారు. విద్యార్థులు తమకు లభించే సదుపాయాలను అందిపుచ్చుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులు అయి తమ కుటుంబం, పాఠశాల, ప్రాంతానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాజ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, కృష్ణ, నరేందర్ యాదవ్, హనుమంతు నాయక్, శ్యామ్, రమేష్, అమర్ యాదవ్, సామ్రాట్ గౌడ్ , తిరుపతి, మల్లేష్ , రాజు, నిర్మల , భారతి, కల్పన పాల్గొన్నారు.