శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో కల్వరి మహిమ ప్రార్థన మందిరంలో స్థానిక నాయకురాలు రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాణి , రాజేష్ , పాస్టర్ రవికుమార్, జ్ఞానమ్మ , ప్రవీణ్ కుమార్, ఝాన్సీ, క్రైస్తవులు పాల్గొన్నారు.