శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): బీహెచ్ఈఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రాంగణంలో పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో సుమారుగా 1400 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్స్ శ్రీనివాస్ అయామృత్, గొర్తి శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.