శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి):కొండాపూర్ లోని మహిళా కేంద్ర సహకార సంక్షేమం, కొమిరిశెట్టి ఫౌండేషన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి యాదవ్, వరలక్ష్మి, ట్రెజరర్ చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు.