మాజీ తానా అధ్యక్షుడు ప్రసాద్ కి “సారస్వత భక్త” బిరుదు

  • ఉచిత ప్రవేశానికి ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని గత నలభై ఏళ్లగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డా శోభా రాజు అధ్యక్షతన అన్నమయ్యపురంలో అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ వున్న విషయం కళా ప్రియులకు, భక్తులకు సువిధితమే. సెప్టెంబర్ 16వ తేదిన అన్నమాచార్య భావనా వాహిని ప్రముఖ ప్రవాస తెలుగు వారు, కళా ప్రోత్సాహకులు, మాజీ తానా అధ్యక్షులు, ప్రసాద్ తోటకూరకి “సారస్వత భక్త” బిరుదు ప్రధానం చేయనున్నారు. అన్నమయ్యపురంలో జరగనున్న ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నది.

ప్రముఖ చలనచిత్ర నటులు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు, మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కళా ప్రియులకు, భక్తులకు అన్నమాచార్య భావనా వాహిని ఉచిత ప్రవేశం కల్పించి తమ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలిపారు. ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు డా. శోభా రాజు నిర్వహనలో సంకీర్తనలాదారంగా ఓ కార్యక్రమం సమర్పించనున్నారు. కార్యక్రమం వెంకటేశ్వర స్వామికి హారతి, అహాతులందరికి ప్రసాద వితరణ తో ముగుస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here