నమస్తే శేరిలింగంపల్లి : మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో రాజాయోగ బ్రహ్మ కుమారిస్ మహిళ విభాగంలో ఏర్పాటు చేసిన కుటుంబ పోషణలో మహిళ పాత్ర అనే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
మహిళలు కుటుంబంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత లక్ష్యంగా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మహిళలకు యాబై శాతం సీట్లు కేటాయించిందన్నారు. మహిళల రక్షణకు భరోసా సెంటర్లు, షీటీంల ఏర్పాటు చేసిందని తెలిపారు. అదేవిధంగా వ్యాపార రంగాల్లో రాణించాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వి-హబ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.