నమస్తే శేరిలింగంపల్లి : 33/11కేవీ చందానగర్ సబ్ స్టేషన్ నిర్వహణ కారణంగా నేడు గురువారం ఈ కింది ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని తారానగర్ ఏఈ ఓపీ వెల్లడించారు.
- విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే..
- 11 కేవీ రైల్‌విహార్ ఫీడర్ పరిధిలోని సాయిబాబా ఆలయ ప్రాంతం, సిటిజన్స్ కాలనీ, శివాజీ నగర్, భారత్ పెట్రోల్ బంక్ వెనుక వైపు గిడ్డగి ప్రాంతం.
- 11 కేవీ రామాలయం ఫీడర్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్, వెంకట్ రెడ్డి కాలనీ, రైల్ విహార్ కాలనీ, పాత లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాలు.
- 11 కేవీ వెజ్ మార్కెట్ ఫీడర్ పరిధిలోని లింగంపల్లి మటన్ మార్కెట్, పోలీస్ క్వార్టర్స్, కనకుంట, కూరగాయల మార్కెట్, ఎస్ఎం లేఅవుట్ ప్రాంతాలు.
- 11 కేవీ ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్ ఫీడర్ పరిధిలోని ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్, ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్, గంగారాం గ్రామ ప్రాంతం.
- 11 కేవీ తారానగర్ ఫీడర్ పరిధిలోని వెంకటాద్రి నగర్, లింగంపల్లి, పోచమ్మ దేవాలయం ప్రాంతం, పీజేఆర్ స్టేడియం ఎదురుగా, శివాజీ నగర్, తారానగర్ గ్రామం, వెనుక వైపు రామాచారి పాఠశాల, తారానగర్ మసీదు, వెంకట్ రెడ్డి కాలనీ, తెల్కర్ అపార్ట్‌మెంట్ ప్రాంతం.
- 11 కేవీ శాంతినగర్ ఫీడర్ పరిధిలోని శాంతి నగర్, కడిమి హాస్పిటల్, హుడా కేఫ్ దగ్గర, వెంకటాద్రి నగర్, జీహెచ్ఎంసీ మీ-సేవా లేన్, విద్యా నర్సింగ్ హోమ్ ప్రాంతాలు.
- 11 కేవీ హుడా కాలనీ ఫీడర్ పరిధిలోని చందానగర్, హుడా కాలనీ ప్రాంతాలు.
- 11 కేవీ చందానగర్ ఫీడర్ పరిధిలోని చందా నగర్ మెయిన్ రోడ్, వెంకటేశ్వర స్వామి దేవాలయం, చెన్నా రెడ్డి హాస్పిటల్ దగ్గర, గీత థియేటర్ ప్రాంతాలలో నేడు (గురువారం) విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
- ప్రజలకు కలుగుతున్న అంతరాయాన్ని అర్థం చేసుకోగలరని నిర్వహణ అనంతరం మళ్లీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని విద్యుత్ అధికారులు విన్నవించారు.