- ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు
నమస్తే శేరిలింగంపల్లి : అతివేగంతో వచ్చిన కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారులు తీవ్ర గాయాలపాలైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కారు డ్రైవర్ సుధీర్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులు రవితేజ, రోహిత్‌రెడ్డితో కలిసి మణికొండలోని వారి ఇంటికి వెళ్తున్నారు.
ఇందులో భాగంగా ఖాజాగూడ నుంచి టోలిచౌకి వైపు వేగంగా వెళ్తున్నారు. రాయదుర్గం మెహ్ ఫిల్ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. కానీ సిగ్నల్ జంప్ చేసి (జేఆర్ఎస్ వైపు దర్గాకు వెళ్తున్న క్రమంలో సిగ్నల్ దగ్గర ఆగిన) ద్విచక్రవాహనం(TS07GG2145)ను ఢీకొట్టారు.
దీంతో బైక్ ఉన్న కోడారి సత్యనారాయణ, కాంతారావు ఇద్దరు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నాలా నగర్‌లోని ప్రీమియం ఆసుపత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేస్ నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.