నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ విలేజ్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం కనులపండువగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బండారు రామచందర్ ముదిరాజ్, రచ్చమల్ల నాగులు గౌడ్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ ఛైర్మన్ (పిసిసి) నల్ల సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్ రాజ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసి లేబర్ సెల్ సంయుక్త కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, కరణ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, సత్తిరెడ్, రామచందర్, శ్రీనివాస్, విజయ్, రవికుమార్, రాంబాబు, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.