నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం రాజాపూర్ గ్రామం నుంచి గడ్డి గోపుల రాములు(45) కూలీ పనిచేస్తూ హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో నివసిస్తున్నాడు. అయితే 27వ తేదీన సాయంత్రం 7.30 గంటలకు అదృశ్యమయ్యాడు.
అటు స్వగ్రామానికి వెళ్లలేదు, ఇటు తను ఉంటున్న కొండాపూర్ కు తిరిగి రాలేదు. తన సంబంధీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఎత్తు 5.7, సాధారణ రంగు, డ్రెస్సింగ్ కోడ్ వైట్ ఫుల్ షర్ట్, తెలుపు రంగు లుంగీ ధరించాడని, ముఖంపై గాయం గుర్తులు ఉంటాయని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.