నివాసిత ప్రాంతంలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

  • సుమారు 5.5 అడుగులు పెరిగిన మొక్కలు
  • స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేసిన చందానగర్ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి : అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చందానగర్ లోని గోపీనగర్ లో కూలీ పని చేసుకుంటూ గోపాల్ (42) నివసిస్తున్నాడు. అయితే అతడు తన ప్లాట్ లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో చందానగర్ పోలీసుల బృందం తనీఖీ చేశారు.

గోపీనగర్ లోని నివాసిత ప్రాంతంలో పెంచుతున్న గంజాయి మొక్కను గుర్తించిన పోలీసులు

గోపీనగర్ లోని హౌజ్ నెం 12-102/6/సి ప్లాట్ లో 5.5 అడుగుల ఎత్తు వరకూ ఉన్న గంజాయి మొక్కలను గుర్తించారు. దాదాపు 600 గ్రాములు ఉండడంతో వాటిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి మొక్క పెంచుతున్న నిందితులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here