అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆకట్టుకుంటున్న హస్తకళా ఉత్పత్తులు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ఆకట్టుకుంటున్నది. ఈ మేళాలోని పలు స్టాళ్ళలో అనంతపూర్ తోలు బొమ్మలు, కోట, పోచంపల్లి, పటోళ్ల సారీస్, మహేశ్వరం, తస్సార్ , మస్లిన్, జాంధానీ, బెంగళూరు సిల్క్, గుజరాత్ బందీని, కాశ్మీరీ సిల్క్ చీరలు, రజాయి, బెడఁషీట్స్, బ్లాక్ ప్రింటింగ్ డ్రెస్ మెటీరియల్స్, చీరలు, టెర్రకోట కుండలు, పాత్రలు, మట్టి బొమ్మలు, పూలకుండీలు, డ్రై ఫ్లవర్స్, లక్నో చికెంకారి డ్రెస్సులు, డెకొరేటివ్ ఐటమ్స్ మొదలైనవి ఎన్నో హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.

అలరించిన సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో జానపద నృత్యాలు

దుబాయ్ నుండి విచ్చేసిన కళాకారిణి కుమారి శ్రావణి తేనేటి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ కర్ణాటక, మధ్యప్రదేశ్ జానపద నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నవి.

కూచిపూడి నృత్య ప్రదర్శనలో కళాకారుల బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here