ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ జయంతి

నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి సభ్యులతో కలిసి కొవ్వొత్తి వెలిగించి బుద్ధ విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. ఈ సమాజం సుఖశాంతులతో ఉండాలంటే బుద్ధుడు సూచించిన మార్గంలో నడవాలన్నారు. అసోసియేషన్ సభ్యులు జనార్దన్, పాలెం శ్రీను, వెంకటేశ్వర్లు, బాలరాజు యాదవ్, గవర్దన్ రెడ్డి, వెంకట చారి, వికాస్, సందీప్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here