నమస్తే శేరిలింగంపల్లి : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నేడు రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జనాబ్ హమీద్ పటేల్ తో కలిసి పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తరువాత, రాజీవ్ గాంధీ 40 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడని, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు యువతకు ఎంతో మార్గదర్శనంగా నిలుస్తూ రాజకీయాలలో రాణించేలా చేస్తుందని అన్నారు. శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు డివిజన్ అధ్యక్షులు, మహిళల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.