వినాయక మండపాల వద్ద అన్నదానం.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లిలోని తారా నగర్, గిడ్డంగి, నెహ్రు నగర్, ఆదర్శనగర్, ప్రశాంతినగర్, రాజీవ్ గృహకల్ప, సందయ నగర్, గచ్చిబౌలి, నల్లగండ్ల, శ్రీరామ్ నగర్ కాలనీ ఏ బ్లాక్, వివిధ కాలనీలలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా గణపతి మండపాల వద్ద లంబోదరుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, గోపాల్ యాదవ్, ఆయా కాలనీల గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here