- రంగారెడ్డి అర్బన్ జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం
నమస్తే శేరిలింగంపల్లి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ” సేవా సప్తాహం ” కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ అధ్వర్యంలో మాదాపూర్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా యువతకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా అర్బన్ యువ మోర్చా నాయకులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని అభినందిస్తూ .. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సేవా కార్యక్రమాలను, అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తూ ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ యాదవ్, ఆనంద్, నవీన్ రెడ్డి, మహేందర్ యాదవ్, రాజేందర్ రెడ్డి, లింగస్వామి, శివకుమార్, మంజునాథ్, గోపి యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.